News

వైభవంగా అయ్యప్ప ఆరట్టు ఉత్సవం

202views

కడప జిల్లాలో అయ్యప్పస్వామి పుట్టిన రోజు వేడుకలలో భాగంగా ఈ ఏడాది అయ్యప్ప ఆరట్టును వైభవంగా నిర్వహించారు. తిమ్మసముద్రం, సుండుపల్లెలో వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప విగ్రహాలను ప్రత్యేక వాహనంలో ఏర్పాటు చేసి మేళతాళాలు బాణాసంచా కాలుస్తూ ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. తిమ్మసముద్రం చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో దాతల సహాయంతో వినాయకుడు, అయ్యప్ప, సుబ్రహ్మణ్యంస్వామి విగ్రహాలను నూతనంగా తీసుకొచ్చారు. అయ్యప్ప పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఉదయం చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో ఉదయం సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో స్వామి వారిని ఊరేగింపు నిర్వహించారు. అయ్యప్ప గురుస్వాములు నాగరాజు, ధనుంజయరెడ్డి, చంద్రమౌళీశ్వర దేవస్థానం చైర్మన్‌ శంకర్‌ల ఆధ్వర్యంలో బాహుదానదిలో అయ్యప్ప ఆరాటు ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో చెన్నంశెట్టిపల్లెకు చెందిన నాగేష్‌ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.