
173views
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రసిద్ధ పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో సోమవారం శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కట్టపై ఉత్సవ విగ్రహాలను నిలిపి ఘనంగా కల్యాణం చేశారు. స్వామివారి మూలవిరాట్‌కు సర్పసూక్త పాలాభిషేకం, పంచామృతాభిషేకం, ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. వందలాదిమంది భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన చంద్రశేఖరరెడ్డి, ఆలయ ఈఓ అక్కిరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





