
214views
కర్ణాటక ప్రభుత్వం ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేయడాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గట్టిగా సమర్థించారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా చెల్లుబాటు కావని తేల్చిచెప్పారు. కర్ణాటకలోని బీదర్, రాయ్‌చూర్ జిల్లాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ 4ు రిజర్వేషన్లు కల్పించడం ఓటు బ్యాంకు రాజకీయమని విమర్శించారు. ‘బుజ్జగింపు రాజకీయాలు బీజేపీకి నచ్చవు. అందుకే రిజర్వేషన్లు మార్చాలని నిర్ణయించింది’ అని అమిత్‌షా విమర్శించారు. మరోవైపు, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘రిజర్వేషన్లను ఆస్తుల్లాగా పంపిణీ చేయొచ్చని వారు భావిస్తున్నారు. అది ఆస్తి కాదు, మైనారిటీల హక్కు. ఓబీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించడానికి ప్రాతిపదిక ఏమీ లేదు. మేం అధికారంలోకి రాగానే రిజర్వేషన్లను పునరుద్ధరిస్తాం’ అన్నారు.





