News

స్వేచ్ఛావతి అమ్మవారి సంబరాలకు శుభరాట

173views

ఇచ్ఛాపురంలోని స్వేచ్ఛావతి అమ్మవారి సంబరాల మహోత్సవాలకు సంబంధించి శుభరాట అంగరంగ వైభవంగా సాగింది. 13 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న గ్రామదేవత ఉత్సవాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. సోమవారం వేకువజామున అమ్మవారి ఆలయంలో మహామర్ధన పూజ నిర్వహించారు. అనంతరం సురంగిరాజా కోట వద్ద శుభరాటకు ప్రత్యేక పూజలు చేసి.. బస్టాండ్‌ మీదుగా అమ్మవారి ఆలయం వరకు బాజాభజంత్రీలు, బాణసంచా కాల్చుతూ.. వేలాదిమంది భక్తులతో శోభయాత్ర నిర్వహించారు. అమ్మవారి గుడిలో శుభరాటకు పూజలు చేసి.. మళ్లీ ఉప్పలవీధిలోని ప్రత్యేక వేదిక(మండపం) వద్దకు శోభయాత్రగా వచ్చి విశేష పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు గ్రామస్థులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.