News

రైల్వే ట్రాక్‌పై ‘గగన్‌యాన్‌’ పారాచూట్‌ పరీక్ష

327views

భారత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష మిషన్‌ గగన్‌యాన్‌లో కీలక ముందడుగు పడింది. ఈ మిషన్‌ సన్నాహకాల్లో భాగంగా.. అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి చేర్చడంలో కీలక పాత్ర పోషించే పారాచూట్‌ పరీక్షను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. చండీగఢ్‌లోని టెర్మినల్‌ బాలిస్టిక్‌ రిసెర్చ్‌ లేబొరేటరీ (టీఆర్‌బీఎల్‌)లోని రైల్వే ట్రాక్‌పై ఈ నెల 1, 3వ తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా మిషన్‌లో ఉపయోగించే రెండు పారాచూట్లు (గగన్‌యాన్‌ పైలట్‌, అపెక్స్‌ కవర్‌ సెపరేషన్‌) నిర్దిష్ట సమయంలో విడుదలవుతున్నాయా లేదా అని పరిశీలించారు. పరీక్ష విజయవంతమైందని ఇస్రో తెలిపింది.