News

కర్ణాటకలో ఆలయ చోరీలు.. నలుగురు ముస్లింల అరెస్టు

21views

కర్ణాటక: మంగుళూరులోని ముల్కీ కిల్పడి గ్రామంలో ‘ఆది కిల్లడి కోర్డబ్బు’ ఆలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్టు చేసి, వారి నుంచి సుమారు రూ.17.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ముల్కీ కర్నాడ్ ప్రాంతంలో సినన్, యాసీన్‌లను, దావణగెరెలో మహమ్మద్ అఫ్రిది, ఎస్.కె. అబ్దుల్ జుమ్మన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

నిందితులను విచారించగా ఉడిపి జిల్లాలోని ఇన్నా గ్రామంలోని వ్యాఘ్ర చాముండేశ్వరి ఆలయం, కల్లపు శ్రీ మహాలక్ష్మి మహాగణపతి ఆలయంలో జరిగిన చోరీలకు సంబంధించిన వివరాలు కూడా వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసుల్లో మరిన్ని వివరాలను రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.