News

‘స్త్రీ, పురుష సమానత్వానికి మరో 300 ఏళ్లు’

271views

ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో మహిళల హక్కులకు భంగం కలుగుతోందని, ఇంటర్నెట్‌ వినియోగంలోనూ మహిళలు వెనుకబడి ఉన్నారని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుబెరస్‌ అన్నారు. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం సాధించేందుకు మరో 300 ఏళ్లు పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘మహిళల స్థితిగతులు’ అనే అంశంపై ఐరాస సదస్సులో గుబెరస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో మహిళలు, బాలికలకు విద్య, ఉపాధి అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉందని సూచన చేశారు.