
245views
హోలీ పండుగ రోజు ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్, డెలివరీ సంస్థ స్విగ్గీ చిక్కుల్లో పడింది. హోలీకి సంబంధించిన ఓ యాడ్‌ను స్విగ్గీ ఏర్పాటు చేసింది. హోలీ రంగులతో యాడ్‌ను రూపొందించి అందులో రెండు కోడిగుడ్ల బొమ్మలను ముద్రించింది. కోడిగుట్లను ఆమ్లెట్ వేసుకునేందుకు మాత్రమే ఉపయోగించాలని, హోలీ రోజు ఎవరి తలపైనా కొట్టరాదని స్విగ్గీ ఆ యాడ్‌లో తెలిపింది. దీంతో స్విగ్గీ యాడ్‌పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సంస్థ వెనక్కి తగ్గి యాడ్‌ను తొలగించింది. హోలీ సరకులను ఇన్‌స్టామార్ట్ ద్వారా కొనుగోలు చేయాలని యాడ్‌లో పేర్కొంది. దీనికితోడు #BuraMatKhelo అనే హ్యాష్‌ట్యాగ్‌ను పొందుపరిచింది.





