News

ఆర్జిత సేవా టికెట్ల కోసం పోటెత్తిన భక్తులు.. తితిదే వెబ్‌సైట్‌ సర్వర్‌ డౌన్‌

180views

తిరుమల: ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి ఆర్జిత సేవాటికెట్ల జారీకి సంబంధించి బుధవారం సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల టికెట్లను సాయంత్రం 4 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ టికెట్ల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లిన భక్తులు.. టికెట్లు బుక్‌ చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వెబ్‌సైట్‌ తరచూ హ్యాంగ్‌ అవడం, ఓపెన్‌ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.