News

అరుణాచల్ భారత్లో అంతర్భాగమే * అమెరికా సెనేట్లో అరుదైన తీర్మానం

297views

అరుణాచలప్రదేశ్ ను భారత్ లో అంతర్భాగంగా గుర్తించాలంటూ అమెరికా సెనేట్లో ఒక ద్వైపాక్షిక తీర్మానాన్ని ప్రవేశపె ట్టారు. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్పీసీ) వెంబడి యథాతథ స్థితిని మార్చేందుకు చైనా సైనిక బలగాలను మోహరించడం, వివాదాస్పద ప్రాంతాల్లో గ్రామాల నిర్మాణం, అరుణాచల్ లోని నగరాలకు మాండరిన్ భాషలో పేర్లు పెట్టిన మ్యాప్ ను విడుదల చేయడం, భూటాన్ లో బీజింగ్ కవ్వింపు చర్యలను ఆ తీర్మాన ఖండించింది. కీలక సెనేటర్లు జెఫ్ మార్కే (డెమొక్రటిక్), బిల్ హాగర్టీ (రిపబ్లికన్) సంయుక్తంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. “అరుణాచల్ వివాదాస్పద ప్రాంతంగా కాకుండా భారత్ లో అంతర్భాగంగా అమెరికా గుర్తిస్తోంది” అని తీర్మానం పేర్కొంది.