News

ఉన్నత విద్యాసంస్థల్లో స్థానిక భాషల్లోనే బోధన… రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలకు యూజీసీ లేఖ

280views

ఉన్నత విద్యాసంస్థల్లో(హెచ్ఐ) బోధనను స్థానిక భాషల్లోనే ఉండేలా చూడాలని వివిధ రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలకు యూజీసీ తాజాగా లేఖ రాసింది. పాఠ్యపుస్తకాలు కూడా మాతృభాషల్లో ఉండాలని సంస్థ చైర్మన్ ఎం జగదీశ్ కుమార్ ఆ లేఖలో సూచించారు. భారతీయ భాషల్లో విద్యాబోధన అనేది జాతీయ విద్యావిధానం (ఎన్ఎస్ఈపీ) – 2020లో కీలక భాగం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక కళాశాలలు, వర్సిటీల్లో పలు రకాలైన అంశాలను మాతృభాషలోనే బోధిస్తున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి చదువుకునే వారికి ఇది ఎంతో భాషల్లోకి ఉపకరిస్తుంది. ఇతర భాషల్లోని మంచి పుస్తకాలను కూడా స్థానిక తర్జుమా చేసి విద్యార్థులకు చేరువయ్యేలా చూడాల్సిన అవసరం ఉంది” అని కుమార్ స్పష్టం చేశారు.