News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

320views

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సుమారు 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న(శుక్రవారం) శ్రీవారిని 57,147 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,094 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.78 కోట్లు వచ్చింది. ఆదివారం రోజు శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ నిర్వహించనున్నారు.