News

ముస్లింలు మత విద్వేషాలకు పాల్పడుతూ.. హిందూ మహిళలను అపహరిస్తున్నారు – రామ్‌దేవ్‌ బాబా సంచలన వ్యాఖ్యలు

383views

ముస్లింలు దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతూ.. హిందూ మహిళలను అపహరిస్తున్నారని యోగా గురువు రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. జైపూర్‌లోని బర్మెర్‌లో జరిగిన సాధువుల సమావేశంలో హిందూయిజాన్ని ఇస్లాం, క్రైస్తవంతో పోలుస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంచి చేయమని హిందూయిజం చెబుతోందని, తక్కిన రెండు మతాలు మతమార్పిడికి పాల్పడుతుంటాయని అన్నారు.

”ముస్లింలు రోజుకు అయిదుసార్లు నమాజ్ చేస్తారు.. ఆ తర్వాత వాళ్లు ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. హిందూ అమ్మాయిలను వాళ్లు ఎత్తుకెళ్తారు.. అన్నిరకాల పాపాలకు పాల్పడతారు. మన ముస్లిం సోదరులు అనేక పాపాలు చేసినా నమాజ్ మానకుండా చేస్తారు. అలా చేయమని వాళ్లకు నేర్పుతారు. హిందూ మతం అలాంటిది కాదు” అని రామ్‌దేవ్‌ అన్నారు. తాను ఎవరినీ విమర్శించడం లేదని, అయితే జరుగుతున్నది అదేనని అన్నారు. కొందరు వ్యక్తులు యావత్ ప్రపంచాన్ని ఇస్లాం స్టేట్‌గా మారుస్తామని మాట్లాడుతుంటారని, కొందరు వ్యక్తులు యావత్ ప్రపంచం క్రైస్తవంలోకి మారాలని చెబుతుంటారని అన్నారు. ఇంతకుమించి వీరికి ప్రత్యేక ఎజెండా ఏమీ లేదని చెప్పారు. ముస్లింలు టెర్రరిస్టులుగా, నేరస్థులుగా మారుతున్నప్పటికీ నమాజ్ మాత్రం చేస్తుంటారని అన్నారు.

హిందూధర్మం హింసకు పాల్పడవద్దని, నిజాయితీగా ఉండాలని చెబుతుందని అన్నారు. ”తెల్లవారుజామునే లేవాలి, భగవంతుడిని ప్రార్థించాలి, యోగా చేయాలి, మంచి పనులు చేయాలి, మంచి ఆలోచనలు చేయాలి, ఇష్టదైవాన్ని పూజించాలని హిందూయిజం చెబుతుంది. సనాతన ధర్మం మనకు బోధించేది ఇదే” అని రామ్‌దేవ్ బాబ తన ప్రసంగం ద్వారా తెలిపారు.