
ఆంధ్రప్రదేశ్ అధికార బాషా సంఘం ఆధ్వర్యంలో వేమన జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ అధికార బాషా సంఘం అధ్యక్షులు పి. విజయబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19వ తేదీ స్థానిక ఎస్ ఆర్ ఆర్ అండ్ సి వి ఆర్ డిగ్రీ కళాశాల వద్ద వేమన జయంతి ఉత్సవాల సందర్భంగా వేమన పద్యాలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు విజయబాబు తెలిపారు. అధికార బాషా సంఘం నిర్వహించే ఈ పోటీలలో నగరంలోని అన్ని కళాశాలల విద్యార్థులు, విద్యార్థినిలు పాల్గొనేందుకు అర్హులేనని ఆయన తెలిపారు. వేమన పద్య పఠన పోటీలలో పాల్గొనే విద్యార్థులు వారి గుర్తింపు కార్డులతో గురువారం ఉదయం 9 గంటలకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన వివరించారు. పోటీలలో విజేతలైన విద్యార్థులకు అధికార బాషా సంఘం తరపున బహుమతులు అందజేయనున్నట్లు విజయబాబు తెలిపారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





