News

513 సార్లు కాల్పులకు తెగబడ్డ పాక్

697views

భారత్ పై పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. భారత్ ఏ విధంగా బుద్ది చెప్పినా పాక్ తీరులో మార్పు రావడం లేదు. ఫిబ్రవరి 26న ఉగ్రవాద సంస్థ జైషే- ఎ- మొహమ్మద్‌పై భారతీయ వాయుసేన ఎయిర్ స్ట్రయిక్ నిర్వహించిన తరువాత పాకిస్తాన్ నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ 513సార్లు కాల్పులకు తెగబడినట్లు రక్షణశాఖ స్పష్టం చేసింది. వైట్ నైట్ కోర్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీఓసీ) లెఫ్టినెంట్ జనరల్ పరమ్‌జీత్ సింగ్… రాజౌరీలో మీడియాతో మాట్లాడుతూ పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ 100కు మించి మోటార్స్, ఇతర మారణాయుధాలను వినియోగించిందని, వీటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని అన్నారు. కాగా భారత సైన్యం పాక్ చర్యలను తిప్పికొట్టిందన్నారు. తాజాగా పూంఛ్‌లో పాక్ దుశ్చర్యకు ఇద్దరు యువతులతో పాటు నలుగురు జవాన్లు గాయపడ్డారన్నారు.