News

వైభవంగా శ్రీ రామ శోభాయాత్ర

1.3kviews

ర్యాదా పురుషోత్తముడు శ్రీ రాముడని గుంటూరుకు చెందిన శ్రీ శివ స్వామి అన్నారు. “రామో విగ్రహవాన్ ధర్మః అని పెద్దలన్నారు. అంటే రాముడు సాక్షాత్తు ధర్మ స్వరూపం. ఏ విధంగా అయితే ధర్మానికి అంతం లేదో, అదే విధంగా శ్రీ రాముని ఆదర్శం ఆచంద్ర తారార్కం వెలుగొందుతుంది.” అని శివ స్వామి పేర్కొన్నారు..

పవిత్ర శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీ రామ ఉత్సవ సమితి అధ్వర్యంలో గుంటూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ షుమారు 15 కిలోమీటర్లు సాగి అయ్యప్పస్వామి దేవాలయం వద్ద ముగిసింది. మండే ఎండను కూడా లెక్క చెయ్యకుండా వేలాది భక్తులు ర్యాలీలో పాల్గొనడం గమనార్హం.

ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్ ప్రాంత సేవా ప్రముఖ్ శ్రీ పృధ్విరాజు, సహ సేవా ప్రముఖ్ శ్రీ కేశవయ్య ఇంకా అనేక మంది హిందూ సంస్థల కార్యకర్తలు, స్వామీజీలు, భక్తులు పాల్గొన్నారు.

మచిలీపట్నంలో…

శ్రీ రామనవమి సందర్భంగా మచిలీపట్నం పుర వీధులలో ఘనంగా శోభాయాత్ర జరిగింది. వేలాది భక్తులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ మహ్మద్ శిలార్ దాదా, ప్రస్తుత మునిసిపల్ చైర్ పర్సన్ తో కలిసి యాత్రకు స్వాగతం పలికి, భక్తులకు తమ స్వహస్తాలతో మంచినీరు, మజ్జిగ అందజేశారు.