News

ఉగ్రవాదులకు బదులు నన్ను టార్గెట్ చేశారు…

643views

గాంధీనగర్‌: “దేశంలో ఉగ్రవాద కార్యాకలాపాలు కూడా పెరిగాయి. ఉగ్రవాదాన్ని టార్గెట్ చేయమని చెప్పాం. కానీ వారు నన్ను మాత్రమే టార్గెట్ చేశారు. అందువల్ల దేశంలో చాలా చోట్ల బాంబు దాడులు జరిగాయి” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్, ఆప్‌లపై మండిపడ్డారు. గుజరాత్ ఎన్నికల ప్రచార సభలలో మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సూరత్, అహ్మదాబాద్‌లో పేలుళ్ళు జరిగి ప్రజలు చనిపోతుంటే ఉగ్రవాదాన్ని రూపుమాపాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని కోరానని, అయితే ఉగ్రవాదాన్ని లక్ష్యం చేసుకోకుండా తనను టార్గెట్ చేశారని మోదీ ఆరోపించారు.

ఉగ్రవాదాన్ని కాంగ్రెస్ తన ఓటు బ్యాంకుగా పరిగణిస్తోందని మండిపడ్డారు. బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు చనిపోయినప్పుడు వారికి మద్దతుగా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడారని ప్రధాని గుర్తు చేశారు. ఉగ్రవాదులకు అనుకూలంగా మొసలి కన్నీరు కార్చారని చెప్పారు. అనేక ఇతర పార్టీలు కూడా సంతుష్టీకరణ చర్యలకు పాల్పడ్డాయని చెప్పారు.

ఖేడాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తమ హయాంలో ఉగ్రవాదం పట్ల ఉదాసీనంగా వ్యవహరించి, ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్‌ని మాత్రం ప్రశ్నిస్తోందని అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి