News

మోదీ సభలో భారీ ప్రాణ నష్టానికి కుట్ర!(వీడియో)

482views

గాంధీనగర్‌: కొంతమంది ఆకతాయిల వల్ల ఇటీవల మోర్బిలో వంతెన కుప్పకూలి వందకు పైగా భక్తులు మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటన మరువక ముందే మరో ఘాతుకానికి కుట్ర జరిగింది. అయితే, అదృష్టవశాత్తు ఎటువంటి దుర్ఘటన సంభవించలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌ పర్యటనలో భాగంగా సభ ఏర్పాటు అయింది. ఆ సభలో మోదీ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి మోదీ సభ భగ్నం చేసి, భారీ ఎత్తున ప్రాణనష్టానికి ప్రణాళిక వేశాడు. అందులో భాగంగానే టెంట్లకు సపోర్టుగా ఉన్న ఇనుప పైపులకు బిగించివున్న నట్లు విప్పేశాడు. ఈ చర్యను ఓ వ్యక్తి వీడియో తీయడంతో గుట్టు రట్టయింది. ఈ వీడియో వైరల్‌ అయింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి