
335views
నంద్యాల: ఏపీలోని నంద్యాల జిల్లా, బుక్కాపురం, తిమ్మాపురం గ్రామాల్లో బుధవారం ఉచిత క్షయ వ్యాధి నిర్ధారణ(మొబైల్ ఎక్స్ రే)పరీక్షలు జరిగాయి. స్థానిక సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఈ వైద్య సేవలు ప్రజలకు అందాయి. ఈ సందర్భంగా సమితి కార్యదర్శి చిలుకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంకా… ఈ నెల మూడోతేదీన బొల్లవరం, తమ్మడపల్లె, నాలుగోతేదీన బండి ఆత్మకూర్, యర్రగుంట్ల, అయిదోతేదీన ఎ.కోడూరు, పార్నపల్లెలలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని.. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో సేవాభారతి సహ కార్యదర్శి పువ్వాడ సత్యనారాయణ, శ్రీనివాస్(ఆర్.ఎం.పి, బుక్కాపురం), మురళి(టెక్నీషియన్), బి.గంగాధర్, ఎన్.శ్రీనివాస్, వైద్య బృందం పాల్గొన్నారు.






