News

తిరుమల తిరుపతి దేవస్థానంపై దుష్ప్రచారం… వివరణ ఇచ్చిన అధికార వర్గాలు

467views

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ‘సేవ్‌’ పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్‌ ట్విటర్‌ పేజీ ద్వారా స్పందించారు. తిరుమల శ్రీవారికి కానుకల రూపంలో అందించిన కానుకల డిపాజిట్లను ఏపీ ప్రభుత్వం, టీటీడీ బోర్డు చైర్మన్‌ కలిసి తప్పుదోవ పట్టించబోతున్నారని వాట్సాప్‌ మెసేజ్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో నిజం లేదని.. ప్రభుత్వం నుంచి క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి