News

నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు

341views

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్​ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది. ఒకే దశలో హిమాచల్ ప్రదేశ్​ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్​ 12న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 8న ఫలితం వెలువడనుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోనూ భారతీయ జనతాపార్టీ అధికారంలో ఉంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరితో పూర్తి కానుంది. హిమాచల్​లో 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. 55 లక్షల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 43 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్‌ పార్టీ 22 స్థానాలు దక్కించుకుంది. అయితే ఆమ్​ఆద్మీ పార్టీ.. హిమాచల్​ ప్రదేశ్​లోనూ బరిలోకి దిగనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి