News

న్యూక్లియర్ ప్లాంట్ డైరెక్టర్​ కిడ్నాప్.. అణు కేంద్రానికి ముప్పు!

336views

ఉక్రెయిన్‌: ఉక్రెయిన్‌ అణు విద్యుత్‌ ప్లాంట్‌ డైరక్టర్‌ జనరల్‌ మురషోవ్‌ను రష్యన్‌ సైన్యం కిడ్నాప్‌ చేసిందని ఉక్రెయిన్‌ స్టేట్‌ న్యూక్లియర్‌ కంపెనీ అధ్యక్షుడు పెట్రోకోటిన్‌ ఆరోపించారు. శుక్రవారం ఓ కారులో వెళుతున్న మురషోవ్‌ను అడ్డగించిన మాస్కో సైన్యం.. అతని కళ్ళ‌కు గంతలు కట్టి ఎత్తుకెళ్ళారని పెట్రోకోటిన్‌ వివరించారు. వెంటనే మురషోవ్‌ను వదిలేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రష్యన్‌ల చర్యలతో ఐరోపాలోని అతిపెద్ద అణు విద్యుత్‌ కేంద్రం భద్రతే ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆక్షేపించారు. కాగా ఈ కిడ్నాప్‌పై రష్యా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి