News

రోడ్డు పక్కనే మృతదేహం పడేసిన ఆర్ఎంపీ డాక్టర్ ఫ‌హీమ్‌!

396views

గురుగ్రామ్: హరియాణా గురుగ్రామ్​లో ఓ ఆర్​ఎంపీ డాక్టర్ నిర్వాకం బయటపడింది. లీలాధర్ అనే 20 ఏళ్ళ‌ యువకుడు జ్వరంతో బాధపడుతూ ఆర్​ఎంపీ డాక్టర్​ ఫహీమ్​ వద్దకు వెళ్ళాడు. అకస్మాత్తుగా వైద్యుడు చేసిన చికిత్స వల్ల లీలాధర్ ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచాడు. క్లీనిక్ నడుపుతున్న ఫహీమ్​, సుభాన్​.. యువకుడి మృతదేహాన్ని అర్ధ‌రాత్రి వాహనంలో తీసుకెళ్ళి రోడ్డు పక్కన పడేశారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీలో నమోదయ్యాయి. సెప్టెంబరు 26 జరిగిన ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు నిందితుడు ఫహీన్​ను అదుపులోకి తీసుకున్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి