
341views
విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అయిదో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శమిస్తోంది. ఈ తల్లి మణిద్వీప నివాసిని. సకల సృష్టి, స్థితి, సంహార కారిణి, శ్రీ విద్యా స్వరూపిణి, ఉపాసకులకు ముఖ్య ఆరాధ్య దేవత, లలితా త్రిపుర సుందరీ దేవిని దర్శించుకుంటే సకల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. దారిద్య్రం, దుఃఖం నశిస్తాయని భక్తుల నమ్మకం.





