
80views
తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి 10 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయస్వామి కల్పవృక్ష వాహనంపై తిరుమాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది వరకు సర్వభూపాల వాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించనున్నారు. నిన్న రాత్రి హంస వాహనంపై శ్రీవారు దర్శనమిచ్చారు.