News

సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం విచార‌ణ లైవ్ ప్ర‌సారాలు ప్రారంభం

391views

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు రాజ్యాంగ ధ‌ర్మాస‌నం చేప‌ట్టిన విచార‌ణ‌ను తొలిసారి లైవ్‌లో ప్ర‌సారం చేశారు. శివ‌సేన‌కు సంబంధించిన కేసును ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. సీఎం షిండే, మాజీ సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రేకు చెందిన కేసును ధ‌ర్మాస‌నం విచారించింది. సెప్టెంబ‌ర్ 27వ తేదీ నుంచి రాజ్యాంగ ధ‌ర్మాస‌నం విచారిస్తున్న కేసుల్ని లైవ్‌లో ప్ర‌సారం చేయాల‌ని గ‌త‌వారం సుప్రీంకోర్టు నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే.

సీజేఐ యూయూ ల‌లిత్ నేతృత్వంలో గ‌త‌వారం ఏక‌గ్రీవం నిర్ణ‌యం తీసుకున్నారు. రాజ్యాంగ ప్రాధాన్యత కలిగిన కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారాలు లేదా వెబ్‌ కాస్ట్‌ ద్వారా ప్రసారం చేయాలని సెప్టెంబర్‌ 27, 2018న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఇచ్చిన ల్యాండ్‌ మార్క్‌ జడ్జిమెంట్‌ నేడు కార్యరూపం దాల్చింది.

అయితే యూట్యూబ్‌కు బ‌దులుగా త్వ‌ర‌లోనే సొంత ఫ్లాట్‌ఫామ్‌పై సుప్రీం విచార‌ణ‌ల‌ను లైవ్ చేయ‌నున్న‌ట్టు సీజే ల‌లిత్ పేర్కొన్నారు. ఈ లైవ్ ప్ర‌సారాల‌ను ప్ర‌జ‌లు త‌మ సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూట‌ర్ల‌లో వీక్షించ‌వ‌చ్చు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి