
388views
న్యూఢిల్లీ: రైల్వే చక్రాల కోసం విదేశాలపై ఆధారపడడం తగ్గించుకోవడంతో పాటు ఎగుమతులు సైతం చేపట్టే విధంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఓ బ్లూ ప్రింట్‌తో ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఏడాదికి 80వేల చక్రాలను తయారు చేసే పరిశ్రమ ఏర్పాటుకు టెండర్ ఆహ్వానిస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
హైస్పీడ్ రైళ్ళకు, ఎల్‌హెచ్‌బీ కోచ్‌లకు అవసరమైన చక్రాలను ‘మేకిన్ ఇండియా’ ప్లాంట్‌లో తయారీకి నిర్ణయించినట్టు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఏడాదికి రూ.600 కోట్ల విలువైన 80వేల చక్రాలు తయారు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రైలు చక్రాల తయారీకి ప్రైవేటు వ్యక్తులను ఈ విధంగా ఆహ్వానించడం దేశంలో ఇదే తొలిసారి అని కేంద్ర మంత్రి చెప్పారు.





