
378views
శ్రీశైలం: రాష్ట్రంలో వైభవంగా జరిగే దసరా మహోత్సవాలకు శ్రీశైలం మల్లన దేవస్థానం ముస్తాబవుతోంది. ఆలయంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ అయిదోతేదీ వరకు దసరా మహోత్సవాలు జరగనున్నట్టు ఈవో లవన్న తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా నవదుర్గ అలంకారంలో భ్రమరాంబదేవి అమ్మవారు దర్శనమిస్తారని పేర్కొన్నారు. ఉత్సవాల్లో స్వామిఅమ్మవార్లకు వాహన సేవలపై గ్రామోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారు.





