News

వడోదరలో గ‌ణేష్ ఊరేగింపుపై రాళ్ళ దాడి!

529views

వడోదర: గణేష్ ఊరేగింపులో రాళ్ళ‌దాడితో వడోదర ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుజరాత్‌లోని వడోదరలోని మాండ్వి ప్రాంతం మీదుగా గణేశుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళుతుండగా రెండు వర్గాల సభ్యులు ఘర్షణ పడి ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. మసీదు కిటికీ అద్దాలు కూడా దెబ్బతిన్నాయి. ఎవరికీ గాయాలు కాలేదు. అయితే, అల్లర్లకు పాల్పడినందుకు ఇరువర్గాల సభ్యులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Source: Hindustan times

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.