News

పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన చర్చి

428views

* భర్త మతం మార్చుకోలేదని వివాహిత ఆత్మహత్య

ర్త తాను చెప్పిన మతం తీసుకోలేదని మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామానికి చెందిన పావని(31)కి, మిరియాల ఈశ్వర అనిల్ ‌కుమార్ ‌కు ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. అనిల్‌ కుమార్‌ భీమడోలులో ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. పావని పెళ్లికి ముందు నుంచే తన తల్లిదండ్రులతో కలిసి చర్చికి వెళ్ళేది. పెళ్ళైనప్పటి నుంచే భర్తను కూడా క్రైస్తవ మతం తీసుకోమని పావని ఒత్తిడి చేస్తోంది. కానీ హిందువైన భర్త అందుకు విముఖత చూపిస్తున్నారు. ఇటీవల అతని చరవాణిలో ముఖచిత్రంగా యేసు ప్రభువు ఫొటోను ఆమె పెట్టగా… అది ఇష్టంలేని అతను దాన్ని తొలగించాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య ఆగస్టు 29వ తేదీ రాత్రి వాగ్వాదం జరిగింది. మరుసటి రోజు భర్త పని నిమిత్తం బయటకు వెళ్లి, రాత్రి తిరిగి ఇంటికి రాగా తలుపు లోపల నుంచి గడియ పెట్టి ఉంది. అనుమానంతో పరిశీలించగా భార్య పావని సీలింగ్‌ ఫ్యాన్ ‌కు వేలాడుతూ కనిపించింది. మృతురాలు సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పదస్థితి మృతి కేసుగా నమోదు చేశామని ఎస్సై చావా సురేష్ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.