News

గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష..

14views

రానున్న గోదావరి పుష్కరాల సమయంలో గోదావరి నది వెంబడి ఏస్నాన ఘట్టంలో పుష్కర స్నానం ఆచరించినా పుణ్యం లభిస్తుందనే విశ్వాసాన్ని భక్తుల్లో కల్పించేందుకు ఇప్పటి నుండే తగిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ అధికారులను ఆదేశించారు.గోదావరి పుష్కరాలు 2027పై చివాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాల విశిష్టతను ఏవిధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దానిపై ఇప్పటి నుండే ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు స్పష్టం చేశారు.ముఖ్యంగా “స్నానం -దానం-పితృతర్పణం”వంటి నినాదంతో గోదావరి పుష్కరాల్లో రాష్ట్ర,దేశ విదేశీ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పుష్కర పుణ్య స్నానాలు ఆచరించే విధంగా తగిన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.భక్తుల రద్దీని నిర్వహించేందుకు స్నాన ఘట్టాల వారీగా తగిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని చెప్పారు.అదేవిధంగా వివిధ పీఠాధిపతులు, మఠాధిపతులు,ఇతర ప్రముఖ స్వామీజీలు, ప్రముఖ ప్రవచన కర్తలను స్వయంగా కలిసి వారి సూచనలు,సలహాలను తీసుకుని పుష్కరాల సమర్ధ నిర్వహణతో పాటు విజయవంతానికి తగిన ప్రణాకలను సిద్దం చేసి,ఆసూచనలను పుష్కరాల కమ్యునికేషన్ ప్లాన్ లో పొందు పర్చాలని సిఎస్ చెప్పారు.

పుష్కరాల సమయంలో భక్తుల రద్ధీ సమర్ధ నిర్వహణ,నియంత్రణకు వీలుగా ప్రతి స్నానం ఘట్టం వద్ద ప్రత్యేక అడ్వయిజరీలు ఏర్పాటు చేయాలని సిఎస్ సాయి ప్రసాద్ స్పష్టం చేశారు.నడక లేదా వాహనాలు దిగి ఆయా స్నాన ఘట్టాల వరకు ఎంత దూరం నడవాలనే దానిపై కూడా స్పష్టంగా బోర్డులను ఏర్పాటు చేసే ప్రణాళికలు సిద్దిం చేయాలని చెప్పారు.దీనిపై ప్రతి రోజు పత్రికల్లో ప్రకటనలు జారీ చేయడం ద్వారా విస్తృత ప్రచారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అంతేగాక ఏ స్నానం ఘట్టంలో పుష్కర స్నానం చేసినా పుణ్యం వస్తుందని ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ద్వారా వారిలో విశ్వాసాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని ఆదిశగా ఇప్పటి నుండే తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.అంతే తప్ప కేవలం పలానా స్నాన ఘట్టంలో స్నానం ఆచరిస్తేనే పుణ్యం వస్తుందనే అపోహను ప్రజల్లో తొలగించాలని సూచించారు.

భక్తుల రద్దీ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యంగా రైలు,రోడ్డు మార్గాల్లో లక్షల్లో తరలి వచ్చే భక్తులను ఏవిధంగా క్రమ బద్దీకరించాలనే కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ అధికారులను ఆదేశించారు.