News

సిసోడియా మనిషికి మద్యం వ్యాపారి రూ. కోటి లంచం!

382views
  • ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న సీబీఐ, విచారణలో పాల్గొననున్న ఈడి

న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సిసోదియా అనుచరుడికి మద్యం వ్యాపారి ఒకరు రూ.కోటి లంచంగా ఇచ్చాడని ఎఫ్​ఐఆర్​లో సీబీఐ పేర్కొంది. మనీష్​ సిసోదియా నివాసాలు సహా పలువురు ప్రముఖుల సంస్థలు, ఇళ్ళ‌ల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ గంటలపాటు విస్తృత సోదాలు నిర్వహించింది. మొత్తం 31 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. అనంతరం రూ.కోటి వ్యవహారంపై ప్రకటన జారీ చేసింది. సిసోదియాతో సహా మొత్తం 15 మందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి