News

ఏకంగా 24 ఏళ్ళుగా పాక్‌కు గూఢచర్యం చేస్తున్న వ్యక్తి అరెస్ట్

452views

న్యూఢిల్లీ: ఏకంగా 24 24 ఏళ్ళుగా భారత్‌లో ఉంటూ పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్న పాకిస్తానీ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 1998 నుంచి ఢిల్లీలోని భాటిమైన్స్ కాలనీలో నివసిస్తూ.. రకరకాల ఉద్యోగాలు చేశాడు. అంతేకాకుండా భారత్‌కు చెందిన 5 సిమ్ కార్డులను పాకిస్తాన్‌కు చేరవేశాడు కూడా. అయితే… భాగ్ చంద్ అనే వ్యక్తి ఇలా పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తున్నాడని నారాయణ్ లాల్ (21) అనే యువకుడు ఢిల్లీ పోలీసులకు వెల్లడించాడు. దీంతో పిజ్జా డెలివరీ బాయ్ వేషంలో ఢిల్లీ పోలీసులు భాగ్ చంద్‌ని పట్టుకొని, అరెస్ట్ చేశారు. ఇలా గూఢచర్యం చేస్తున్నాడన్న విషయం ఆయన కుటుంబీకులెవ్వరికీ తెలియదు.

Source: RITAM

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి