
361views
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత దివంగత అటల్ బిహారీ వాజ్పేయీ నాలుగో వర్ధంతి సందర్భంగా అనేక మంది ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు నివాళులు అర్పించారు. దిల్లీలోని వాజ్పేయీ స్మారకం ‘సదైవ్ అటల్’కు తరలివెళ్లి.. ఆ మహానేత సేవలను స్మరించుకున్నారు. అంతకుముందు వాజ్పేయీ స్మారకార్థం ఏర్పాటు చేసిన ప్రార్థనా సమావేశంలో పాల్గొన్నారు.





