News

ఏబీవీపీ ఆధ్వ‌ర్యంలో మొక్క‌లు నాటిన విద్యార్థులు

455views

విశాఖ‌ప‌ట్నం: ఏపీలోని విశాఖ‌ప‌ట్నంలో అఖిల భార‌తీయ విద్యార్థి ప‌రిష‌త్‌(ఏబీవీపీ) కార్య‌క‌ర్త‌లు ప‌లువురు విద్యార్థినీవిద్యార్థుల‌తో వివిధ జాతుల‌కు చెందిన మొక్క‌లు నాటించారు. “వృక్షా మిత్రా అభియాన్” లో భాగంగా గురువారం విశాఖ‌ ఏబీవీపీ-ఎస్‌.ఎఫ్‌.డి(స్టూడెంట్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్‌) శాఖ ఆధ్వ‌ర్యంలో ఎండాడ‌, తోట‌గ‌రువు, బీవీకే ఉన్న‌త పాఠ‌శాల‌లో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.  విశాఖ అర్బన్ జిల్లా కన్వీనర్ రాజు, విశాఖ సిటీ ఉపాధ్యక్షుడు వివేక్, సంతోష్, ఆయా పాఠ‌శాల‌ల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి