News

అడవి పందుల బెడ‌ద‌తో రిజర్వాయర్‌లోకి దూకిన ఆవులు…ర‌క్షించిన జాల‌ర్లు

405views

నంద్యాల‌: ఏపీలోని నంద్యాల జిల్లాలోని వెలుగోడు జలాశయంలో ఆవుల మంద దూకింది. అడవి పందులు తరమడంతో ప్రాణభయంతో తెలుగు గంగ రిజర్వాయర్​లోకి దూకాయి. ఇది గమనించిన పశువుల కాపర్లు ఆందోళన చెందారు. వెంటనే అక్కడ ఉన్న జాలర్లకు సమాచారమిచ్చారు. సుమారు 500 ఆవులు ఉన్న‌ట్టు కాపర్లు తెలిపారు. జాలర్లు బోట్ల సహాయంతో వాటిని ఒడ్డుకు చేర్చారు. దీంతో పశువుల కాపర్లు ఊపిరి పీల్చుకున్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి