News

ఉదయపూర్ టైలర్ హత్య వెనుక హైదరాబాదీ ముస్లింల హస్తం!

469views

న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన రాజస్థాన్‌ ఉదయ్‌పుర్‌ దారుణహత్య కేసులో హైదరాబాద్‌ లింకులు బహిర్గతమయ్యాయి. టైలర్‌ కన్హయ్యలాల్‌ను దారుణంగా హత్య చేసిన నిందితులతో సంబంధం ఉందనే ఆరోపణలతో ఇప్పటికే హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌కు చెందిన మునావర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారించిన సంగతి తెలిసిందే. కన్హయ్యలాల్‌ హత్య కేసు నిందితులు గతంలో హైదరాబాద్‌ వచ్చి వెళ్ళారని, నిందితుల ఫోన్‌లో మునావర్‌ నంబరు ఉండటంతోనే అతడికి ఎన్‌ఐఏ నోటీసులు జారీ చేసింది.

ఈ అంశం మరిచిపోకముందే హైదరాబాద్‌ సంతోష్​నగర్​లో మరొకరిని రాజస్థాన్‌ పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్​కు చెందిన అజ్మీర్‌ దర్గా ఖాదిమ్‌ గౌహర్‌ఖాన్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. కన్హయ్యలాల్‌ హత్య అనంతరం గౌహర్‌ఖాన్‌ హైదరాబాద్‌ వచ్చి మునావర్‌ వద్ద తల దాచుకున్నట్టు అనుమానిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి