News

ఘోర ప్రమాదం… 15 మంది అమర్‌నాథ్‌ యాత్రికులు మృతి

311views

జమ్ముకశ్మీర్‌: అమర్‌నాథ్‌ యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు జమ్ముకశ్మీర్‌లోని కాజిగుండ్‌ ప్రాంతంలో గురువారం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో 15 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 45 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై కాజీగుండ్‌లోని బద్రాగుండ్‌ క్రాసింగ్‌ వద్ద టిప్పర్‌ డంపర్‌ ఢీకోట్టినట్టు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను స్థానికు ఆసుపత్రులకు తరలించినట్టు వెల్లడించారు. బల్టాల్ బేస్ క్యాంపునకు వెళుతున్న బస్సు అదుపుతప్పి ఖాజీగుండ్‌లోని నుసూ బడేర్‌గుండ్ సమీపంలో జాతీయ రహదారిపై ఒక టిప్పర్ డంపర్‌ను ఢీకొందని అధికారులు తెలిపారు.

కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అమర్‌నాథ్‌ యాత్రకు అంతరాయం ఏర్పడింది. జూలై 8న 16 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గల్లంతు కావడంతో యాత్రను నిలిపివేశారు. వర్షాలు తగ్గిన క్రమంలో యాత్రను పునరుద్ధరించారు అధికారులు. తిరిగి ప్రారంభమైన మూడో రోజే ఈ ఘోర ప్రమాదం సంభవించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి