News

శ్రీలంకలో చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు దూరంగా ఉండండి

536views
  • భారత వ్యాపారవేత్తలను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: శ్రీలంకలో చైనా అండతో నిర్మిస్తున్న పోర్ట్ సిటీ కొలంబో ప్రాజెక్ట్‌ విషయంలో దూరం పాటించాలని భారత్ నిర్ణయించింది. భారతీయ ప్రైవేటు భాగస్వాములకు ఈ విషయాన్ని తెలియజేసింది. పీసీసీ(పోర్ట్ సిటీ ఆఫ్ కొలంబో) ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం భారత ప్రయోజనాలకు విరుద్ధంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు సీనియర్ అధికారులు ఉన్నత స్థాయి సమావేశంలో తేల్చారు. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విక్రమ్ మిస్రీ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి