News

మాల్దీవుల నుంచి సింగపూర్ పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు

402views

కోలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజ పక్షే మాల్దీవుల నుంచి కూడా పరారయ్యారు. తన కుటుంబంతో సహా ఆయన సింగపూర్ చేరుకున్నారు. సౌదీ ఎయిర్‌లైన్స్ విమానంలో ఆయన సింగపూర్ చేరుకున్నారు. మాల్దీవుల్లో కూడా శ్రీలంక జాతీయులు ఆందోళనకు దిగడంతో ఆయనకు మరో గత్యంతరం లేకుండా పోయింది. అయితే, రాజపక్షే తమను ఆశ్రయం కోరలేదని, ప్రైవేట్ పర్యటనలో భాగంగా వచ్చారని సింగపూర్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి