
కొలంబో: శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ విధించారు. దేశంలోని అత్యధిక అత్యయిక స్థితి విధిస్తున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. పశ్చిమ ప్రావిన్స్‌లో కర్ఫ్యూను విధిస్తున్నట్టు పేర్కొంది. అధ్యక్షుడు గొటబాయ పరారైన నేపథ్యంలో ఆ స్థానంలో తాత్కలిక అధ్యక్షుడిగా విక్రమ సింఘే ఈ ఆదేశాలను జారీ చేశారు.
మరోవైపు ప్రధాని రణిల్ విక్రమసింఘే కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు ప్రధాని కార్యాలయాన్ని ముట్టడించారు. విక్రమసింఘే కూడా ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు నిరసనకారులను నియంత్రించేందుకు బాష్పాయువు ప్రయోగించారు. విక్రమసింఘే ప్రధాని పదవిని నుంచి ఈరోజు రాజీనామా చేయాల్సి ఉంది. ఈ విషయంపై ఇప్పటికే ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రణిల్ తాత్కలిక అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Source: EtvBharat





