News

ముస్లింల చేతిలో న్యాయ విద్యార్థి హ‌తం!

380views

మీరట్‌: మీరట్‌లోని పిలోఖాడి పరిసరాల్లో జూన్ 26, 2022న స్వలింగ సంపర్కులైన ముస్లిం మిత్రులు 22 ఏళ్ల హిందూ యువకుడు యశ్ రస్తోగిని హత్య చేశారు. అనంతరం అతని శరీర భాగాలను ఛిద్రం చేసి మురుగు కాలువలో పడేశారు. న్యాయ విద్యార్థి యశ్ రస్తోగి మృతి చెందాడు. నలుగురు అనుమానితులను మీరట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదనపు విచారణలు చేస్తున్నారు. రస్తోగి, అత‌ని మిత్రులు మెడికల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాగృతి విహార్ సెక్టార్ 6లో నివ‌సిస్తున్నారు.

జూలై 2న, అర్థరాత్రి, మీరట్ పోలీసులు డ్రెయిన్‌లో కుళ్లిపోయిన మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసు విచారణ ప్రకారం, పట్టుబడిన నిందితులు ఇమ్రాన్, షావేజ్ ఖాన్, అలీ, సల్మాన్ రస్తోగిని చంపడానికి ముందు స్వలింగ సంపర్కం చేసినట్టు అంగీకరించారు.

రస్తోగి జూన్ 26 సాయంత్రం ఫతేహుల్లాపూర్ ప్రాంతంలోని తన వర్క్‌షాప్‌లో ప్రధాన నిందితుడు షావెజ్‌ను కలవడానికి వెళ్లిన తర్వాత అదృశ్యమయ్యాడు. యష్ కుటుంబం జూన్ 27 ఉదయం మిస్సింగ్ ఫిర్యాదు చేసింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి