News

పాకిస్తాన్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం… దేశవ్యాప్తంగా మొబైల్, ఇంటర్నెట్ సేవల నిలిపివేత!

422views

ఇస్లామాబాద్‌: తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌లో కరెంటు కష్టాలు తీవ్రమయ్యాయి. దీంతో దేశం మొత్తం గంటలకొద్దీ విద్యుత్‌ కోతలు పెట్టే పరిస్థితి ఏర్పడింది. అత్యవసర సేవలనూ నిలిపివేసే పరిస్థితులు సమీపించాయి. ఇలా దేశవ్యాప్తంగా గంటలపాటు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయాల్సి వస్తున్నట్టు పాకిస్తాన్ టెలికాం ఆపరేటర్లు హెచ్చరికలు జారీచేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి