
466views
పూరి: ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో పూరీలో జగన్నాథ రథయాత్ర కు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈసారి యాత్రకు 15 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. రథయాత్ర నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే 205 ప్రత్యేక రైళ్ళు నడుపుతోంది. అన్ని ప్రాంతాల నుంచి మరో వెయ్యి బస్సులు నడుపుతున్నారు.
మంచినీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పిస్తున్నారు. భారీగా భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. 185 ప్లాటూన్ల బలగాలను సిద్ధంగా ఉంచారు. 1000 మంది పోలీసు ఉన్నతాధికారులు రథయాత్రను సమీక్షిస్తున్నారు. అడుగడుగునా సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.





