News

రాజ‌స్తాన్‌లో విద్వేషంగా ప్ర‌సంగించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్

475views

అజ్‌మేర్‌: రాజ‌స్తాన్‌లోని అజ్‌మేర్‌లో విద్వేష ప్రసంగానికి సంబంధించి ఫకర్‌ జమాలీ అనే ఓ మత గురువుతో పాటు రియాజ్‌, తాజిమ్‌ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. జూన్‌ 17న అజ్‌మేర్‌ దర్గా వద్ద వారు చేసిన నినాదాలు.. విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన గోహర్‌ చిస్తీ పరారీలో ఉన్నట్టు చెప్పారు.

‘ప్రవక్తకు జరిగిన అవమానానికి.. తల నరికివేతే ఏకైక శిక్ష’ అని గత నెల 17 నాటి ర్యాలీలో వారు వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. వారి ప్రసంగాల వల్లే కన్హయ్య హత్య జరిగి ఉండొచ్చా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి