
407views
తిరుపతి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించనుంది. గత రెండు సంవత్సరాలగా కోవిడ్ ప్రభావంతో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించారు. ఈ సంవత్సరం యాథావిధిగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను నాలుగు మాడ వీధుల్లో స్వామివారు విహరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 27న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి.
అక్టోబరు 1న గరుడ సేవ, 2న బంగారు రథం, 4న మహారథం, 5న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇదిలావుండగా, సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో వికలాంగులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. అలాగే, వీఐపీ సిఫార్సు లేఖల దర్శనాలు రద్దు చేశారు. బ్రహ్మోత్సవాల సమయాన పెరటాసి మాసం రావడంతో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందని టీటీడీ తెలిపింది.





