
430views
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంట చైనా భారీ ఆయుధాలను చేర్చింది. అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సరిహద్దులకు తరలించింది. వెస్ట్రన్ సెక్టార్‌లో ఎల్‌ఏసీ నుంచి 100 కిలోమీటర్ల దూరంలోపు దీర్ఘశ్రేణి శతఘ్నులు, రాకెట్ వ్యవస్థలను ఏర్పాటు చేయడంతోపాటు రన్‌వేల అభివృద్ధి చేపట్టింది. వీటితోపాటు ఫైటర్ జెట్‌లను భద్రపర్చేందుకు బ్లాస్ట్‌ప్రూఫ్ బంకర్ల నిర్మాణం కూడా చేపట్టింది. భారత్‌తో వివాదం మొదలైన రెండేళ్ళలోనే వీటిని సిద్ధం చేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనావేశాయి. ఈ విషయాన్ని కేంద్రంలోని కీలక అధికారులు ఓ ఆంగ్లపత్రికకు వివరించారు. ఇటీవల అమెరికా ఆర్మీ పసిఫిక్ కమాండ్ జనరల్ చార్లెస్ ఫ్లయాన్ కూడా భారత్ పర్యటన సమయంలో చైనా మోహరింపులపై ఆందోళన వ్యక్తం చేశారు.





