
న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల కేసులో అత్యున్నత న్యాయస్థానంలో నరేంద్ర మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ పరిణామంపై బీజేపీ కీలక నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఏఎన్‌ఐ ఇంటర్వ్యూలో స్పందించారు. ఇన్నేళ్లలో.. ఈ ఆరోపణలపై మోదీ మౌనంగా ఎంతో బాధపడ్డారని, అది తాను కళ్ళారా చూశానని అన్నారు.
గుజరాత్ అల్లర్ల కేసులో మోదీకి క్లీన్‌చిట్ ఇవ్వడం శుభపరిణామం. కొన్ని ఎన్జీవోలు, మీడియా సంస్థలు కలిసి మోదీపై బురదజల్లాయి. కానీ, వెలుగుతున్న సూర్యుడిలా మోదీ ఆరోపణల నుంచి బయటకు వచ్చారు. మోదీ ఇమేజ్‌ను దెబ్బ తీయడానికి వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. గుజరాత్ అల్లర్లపై విష ప్రచారం చేశారు. అరవై మందిని రైల్లో సజీవంగా తగలబెడితే విపక్షాలు మాట్లాడలేదు. మైనారిటీ ఓటు బ్యాంక్ కోసం పాకులాడాయి. సిట్ విచారణను మేమేమీ ప్రభావిత చేయలేదు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరిగిందన్నారు.





