News

స్వల్ప శ్రేణి క్షిపణి ప్ర‌యోగం విజ‌య‌వంతం

357views

చాందీపూర్‌: ఉపరితలం నుంచి గాల్లోకి నిట్టనిలువుగా ప్రయోగించగల స్వల్ప శ్రేణి క్షిపణి (VL-SRSAM)ని భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌ తీరంలో యుద్ధనౌక నుంచి ప్రయోగించిన ఈ మిసైల్‌.. హైస్పీడ్‌ ఏరియల్‌ టార్గెట్‌ను ఛేదించినట్టు అధికారులు వెల్లడించారు. ”డీఆర్డీవో , భారత నావికాదళం కలిసి నేడు వీఎల్‌-ఎస్‌ఆర్‌ఎస్‌ఏఎంను విజయవంతంగా పరీక్షించాయి. ఈ ప్రయోగం ఒడిశా చాందీపూర్ తీరంలో ఇండియన్ నేవల్ షిప్ నుంచి నిర్వహించారు” అని డీఆర్డీవో అధికారి తెలిపారు. యుద్ధ నౌకలనుంచి ప్రయోగించే ఈ క్షిపణి.. రాడార్‌కు దొరకకుండా సీ-స్కిమ్మింగ్‌ సాంకేతికతతో దూసుకొచ్చే లక్ష్యాలతోపాటు సమీప పరిధిలోని వివిధ వైమానిక టార్గెట్‌లను కూల్చివేస్తుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి