News

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్​ హతం

443views

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా కడ్లా గ్రామంలో సోమవారం పోలీసులకు, నక్సల్స్ కు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళతో సహా కనీసం ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్ గురించిన సమాచారాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్​ చేశారు.

“చనిపోయిన నక్సల్స్ ను డివిజనల్ కమిటీ సభ్యుడు నగేష్‌గా గుర్తించారు. అతనిపై రూ. 15 లక్షల రివార్డు కూడా ఉంది. ఏరియా కమాండర్లు మనోజ్, ఒక మహిళ రమే, ఇద్దరూ ఒక్కొక్కరికి రూ.8 లక్షల రివార్డును ఉంది” అని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ఎన్​కౌంటర్​ స్థలంలో నక్సల్స్‌ నుంచి ఏకే-47, 303 రైఫిల్‌, 12-బోర్‌ యాక్షన్‌ గన్‌ స్వాధీనం చేసుకున్నట్లు సీఎం చౌహాన్​ తన ట్వీట్​లో పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి